పీడీఎస్ బియ్యం పట్టివేత
కమ్మర్ పల్లి, బతుకమ్మ : అక్రమంగా నిలువ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు కమ్మర్ పల్లి పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలోని గాంధీ నగర్ లో ప్రజా పంపిణీ బియ్యం 7బస్తాలు అక్రమంగా నిలువ ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి భద్రత నిమిత్తం వెంకటేశ్వర్ రైస్ మిల్ కు తరలించారు.