మాక్లూర్, బతుకమ్మ: మాక్లూర్ మండలంలోని రైమత్ నగర్ లోని ఓ గోదాముపై సీసీఎస్ పోలీసులు దాడి చేసి పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయడంతోపాటు నిల్వ చేసిన అలీమ్ ను అదుపులోకి తీసుకుని మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.