బతుకమ్మ, మెండోరా:మెండోరా మండలం కోడిచెర్ల గ్రామంలో గురువారం అర్ధరాత్రి సమయంలో జగిత్యాల్ నుండి మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటళ్ల పిడిఎస్ బియ్యాన్ని మెండోరా ఎస్సై నారాయణ పట్టుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పక్కా సమాచారంతో కోడిచర్ల గ్రామ సమీపంలో ఎస్సై తన సిబ్బందితో కలిసి పట్టుకొని సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ కు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.