నిరుద్యోగ యువతను మోసం చేసిన ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు
సైబర్ నేరగాళ్లను ఉపేక్షించేదిలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : నిరుద్యోగ యువతకు విదేశాలలో ఉద్యోగం ఇస్తామని మోసం చేసే వారిచేత సైబర్ నేరాలు చేయిస్తున్న ఒకరిపై పి.డి యాక్ట్ నమోదు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొంత మంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తాము అని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు...