. . .ఇద్దరికి ఏడాది వరకు జైలే
కామారెడ్డి, బతుకమ్మ :
పనసపండ్ల మాటున 387.128 కిలోల గంజాయి (రూ.1.93 కోట్లు) తరలించిన ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులపై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా లో గంజాయి తో దొరికిన ఇద్దరు నిందితులకు జైలు లో పిడి యాక్ట్ ఉత్తర్వులు అందచేశారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని ఎస్పీ తెలిపారు.యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే ఉపేక్షించమన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండండి.. యువత భవిష్యత్తును కాపాడుకుందాం అన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయండి అని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.