Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 8:29 pm Posted by : ramakrishna

ఘనంగా పీసీసీ ప్రెసిండెంట్ బర్త్ డే వేడుకలు

  • లింబాద్రి గుట్ట పై ప్రత్యేక పూజలు
  • కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమ ఏర్పాటు
  • యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి

 

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ   బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బర్త్ డే వేడుకలను భీమ్ గల్ మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహింపజేసి,అర్చన, హారతి కార్యక్రమాలను అర్చకులచే నిర్వహింపజేశారు. లింబాద్రిగుట్టపై ప్రతి శనివారం జరిగే అన్నదాన సత్రంలో మహేష్ కుమార్ గౌడ్ పేరున అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు.అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.రాబోయే రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ కు మరిన్ని ఉన్నత పదవులు రావాలని, ఆయనకు,వారి

PCC President's birthday celebrated in grand style

కుటుంబానికి లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని వేడుకొన్నారు. కానిస్టెన్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్  సెపూర్ చరణ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,ఎస్సీ సెల్ అనంతరావు,ఎస్టీ సెల్ గోపాల్ నాయక్,బీసీ సెల్ కొరాడి రాజు,యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు,కానిస్టెన్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెపూర్ చరణ్, తోట సతీష్, సాయిబాబా భూషణ్, చింటూ, కార్తీక్, గంగూలీ,సురేష్,పల్లె శేఖర్,సాయిలు,జనార్ధన్,నీలం రవి,గణేష్,శ్రీను,సేవాలాల్,శ్రావణ్,రాజేశ్వర్ గౌడ్,రాము,శ్రీకాంత్,నవీన్,గంగాధర్,జేమ్స్,మోహన్,సంగ్య నాయక్,నవీద్,జీషన్ తదితరులు పాల్గొన్నారు.

PCC President's birthday celebrated in grand style