Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 3:48 pm Posted by : ramakrishna

ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పలు సేవా సంస్థలలో సేవక్రమాలు,ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మహేష్ కుమార్ గౌడ్ కు పుట్టినరోజు కానుకగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న కృషిని విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది అని తెలిపారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ బీసీ నాయకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తూనే అన్ని వర్గాలను సమానంగా చూస్తున్న నాయకుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, పిసిసి ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, పిసిసి మాజీ కార్యదర్శి రాంభూపాల్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, పార్లమెంట్ మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా సేవల అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకులు మఠం రేవతి, సుజాత, పోల ఉష, విజయలక్ష్మి, విజయ, అపర్ణ, అవిన్ ,కొండపాక రాజేష్,సిరికొండ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PCC President Mahesh Kumar Goud's birthday celebrated in grand style