ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల పరిధిలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుగా కేక్ కట్ చేసి బస్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులకు పండ్లను పంపిణీ చేసి ఏర్గట్ల గ్రామంలో డిజే సౌండ్ సిస్టం ను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలతో బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ది మన బాల్కొండ నియోజకవర్గమని గుర్తు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ రాజకీయపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగి ఉన్నతమైన శిఖరాల వరకు ఎదగాలని ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని గతంలో మాదిరి రాజకీయ సెంటిమెంట్ ప్రకారం నిజామాబాద్ జిల్లా నుండి పీసీసీ అధ్యక్షులుగా ధర్మపురి శ్రీనివాస్ ఉన్నప్పుడు వరుసగా రాష్ట్రంలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో కూడా పీసీసీ అధ్యక్షుడు హోదాలో మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో బలంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గతంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సేవలు అందించిన సోమా దేవరెడ్డి, అలాగే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నియామకమైన రవిరెడ్డి ని ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ తరపున పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, సొసైటీ చైర్మెన్, కేఎంసీ డైరెక్టర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కిషన్ ఖేత్ నాయకులు, ఏర్గట్ల మండలంలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
