టీఎన్జీఓ ఆధ్వర్యంలో పీసీసీ ప్రెసిడెంట్ కు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో  టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సోమవారం ఘనంగా సన్మానించారు. అనంతరం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాశెట్టి సుమన్ కుమార్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమన్ కుమార్ ఉద్యోగుల సమస్యలపై చర్చించగా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో...