ఘనంగా పీసీసీ చీఫ్ జన్మదిన వేడుకలు
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, పిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి,మేకల సాయన్న, పాకాల ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.