ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ చీఫ్

హైదరాబాద్, బతుకమ్మ : ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే ను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఖర్గే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఉపాధ్యక్షులు బొంతు రాంమోహన్, కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితర నాయకులు ఉన్నారు.