Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 December 2024, 7:54 pm Posted by : ramakrishna

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ క్రికెట్‌ టోర్ని అభినందనీయం

  •  కులమతాలకు అతీతంగా క్రీడా స్పూర్తిని చాటారు
  • విజేత, రన్నర్‌లకు ట్రోఫిలు, నగదు ప్రోత్సహాలు
  •  అడిషనల్‌ డిసిపి బసవరెడ్డి, రైతు కమిషన్‌ సభ్యులు గడుగుగంగాధర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీసీసీ ఛీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ పేరు క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించి విజయవంతం చేయడం అభిందనీయమని అడిషనల్‌ డిసిపి బసవరెడ్డి రేడ్డి అన్నారు. ఈ నెల 3 నుంచి 20వరకు పీసీసీ ఛీఫ్‌ మహేష్‌కుమార్‌ క్రికెట్‌కప్‌ టోర్నమెంట్‌ను ఆర్గనైజర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంగా నిర్వహించగా ముగింపు శుక్రవారం పాలిటేక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. ముఖ్య అథితిగా అడిషనల్‌ డిసిపి బసవరెడ్డి, రైతు కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌లు హాజరైనారు. ఈ సందర్బంగా అడిషనల్‌ డిసిపి మాట్లాడుతూ, ఆటల పోటీల్లో కులాలకు, మతాలకు తావివ్వకుండా అందరు స్నేహాపూర్వకంగా ఆడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే విదానాన్ని కొనసాగించాలన్నారు. ముఖ్యంగా క్రికెట్‌కు చాలా ఆదరణ ఉందని, గెలిచినా, ఓడినా రెండు సమానంగా తీసుకోవాలన్నారు. ఆటలో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. క్రీడా స్పూర్తి చాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు నచ్చిన క్రీడలో సాధన చేయాలన్నారు. గత 18 రోజులుగా జిల్లాలో పెద్ద ఎత్తున క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించగా జిల్లాలోని నలుమూలల నుంచి క్రిడాకారులు పాల్గొని ప్రాతినిత్యం వహించారు. విజేత,రన్నర్‌లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.  అనంతరం రైతు కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌ మాట్లాడుతూ, జిల్లా నుంచి ఉన్నతంగా ఎదిగేలా క్రికెట్‌లో రాణించాలన్నారు. ప్రతినిత్యం ప్రాక్టీసు చేసి ఉన్నతాశిఖారాలను అధిరోహించాలన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విన్నర్, రన్నర్‌లకు ట్రోఫిలు, నగదు ప్రోత్సహాకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోటీ పిసిసి రాష్ట్ర లీగల్‌సెల్‌ ఉపాధ్యక్షులు దయాకర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు రత్నాకర్, టోర్ని ఆర్గనైజర్‌ శ్రీనివాస్‌గౌడ్, ఎర్రం గంగాధర్, ఖుద్దుస్, శ్యామ్, తదివతరులు పాల్గొన్నారు.
మొదటి  విజేతగా నిలిచిన ఆరెంజ్‌ ఆర్మీ జట్టుకు రూ. 25వేలు నగదుట్రోఫీ అందజేశారు. రన్నర్‌గా నిలిచిన  నిజామాబాద్‌స్టార్‌ జట్టుకు రూ. 15వేల నగదు, ట్రోఫీ అందజేశారు. మ్యాన్‌ఆఫ్‌దమ్యాచ్‌ – శివ, = బెస్ట్‌బ్యాట్స్‌మెన్‌– శివ,  బెస్ట్‌ బౌలర్‌– చైనా రాజు,  బెస్ట్‌ఫీల్డర్‌– జాఫర్‌,  బెస్ట్‌ క్యాచ్‌– మీర్జాలకు ట్రోఫీలు అందజేశారు.

PCC chief Mahesh Kumar Gowda congratulated the cricket tournament