Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 1:00 pm Posted by : ramakrishna

ఖిల్లా రామాలయం సీతారామ కల్యాణోత్సవంలో పీసీసీ చీఫ్ దంపతులు

 

. . . సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దంపతులు 

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

నిజామాబాద్  నగరంలోని ఖిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు తీసుకురాగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ రామ నవమి పర్వదినోత్సవం సందర్భంగా సతీ సమేతంగా సీతా రామ కల్యాణోత్సవం లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మేయర్  ఉమారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PCC chief couple at the Sitarama wedding ceremony at Killa Rama Temple