Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 7:26 pm Posted by : ramakrishna

దివంగత సుదర్శన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన పీసీసీ చీఫ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దివంగత సీనియర్ రాజకీయ నేత, ప్రజా సంఘాల జెఎసి అధ్యక్షుడు, న్యాయవాది దేశపతి సుదర్శన్ రావు కుటుంబ సభ్యులను మంగళవారం ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని రావు ఇంటికి వెళ్ళి ఆయన కుమారుడు విశ్వక్ సేన్ రాజ్ ను రావు భార్యను ఓదార్చారు. రాజకీయ జీవన ప్రయాణంలో సుదర్శన్ రావు తోడ్పాటు మరువలేనిదని అన్నారు. తన రాజకీయ జీవితానికి రావు పాత్ర ఎంతో ఉన్నదని తెలిపారు. సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కలిసి నడిచిన గుర్తులెన్నో ఉన్నాయని పీసీసీ చీఫ్ గుర్తు చేసుకున్నారు. పార్టీలు వేరైనా మనుషుల మధ్య అనుబంధాలకు కొదవ లేదని అన్నారు. యువకుడైన విశ్వక్ రాజ్ కు భవిష్యత్ బాగుంటుందని తెలుపుతూ తండ్రిలేని లోటును, దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు. పీసీసీ అధ్యక్షుని వెంట స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ గౌడ్, ధర్మపురి, దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.