భీంగల్, బతుకమ్మ : భీంగల్ మండలం లోని లొద్ది రామన్న మందిరంలో శ్రీ రామ నవమి సందర్బంగా సీతారాములకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొని పట్టవస్త్రాలు సమర్పించారు. అనంతరం సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన అనంతరం తన స్వగ్రామానికి మొదటి సారిగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన

తన సొంత గ్రామంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అంతకు ముందు ఆయనను రాష్ట్ర ఖనిజావ్రుద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
