Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2024, 3:31 pm Posted by : ramakrishna

వరద బాధితులకు మూల వేతనం చెల్లించడం హర్షణీయం

  • టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్

బతుకమ్మ, మాచారెడ్డి: వరద బాధితులను ఆదుకునేందుకు టీజీ ఈజాక్ నిర్ణయం తో ఒక రోజు మూల వేతనం దాదాపుగా 130 కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి చెల్లించడం పట్ల టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
సిహెచ్ అనిల్ కుమార్ హర్షం వ్యక్తంచేశారు. కరోనా సమయంలో నిత్యావసర సరుకులు సరఫరా చేసి సామాజిక బాధ్యత గల సంఘంగా టీపీటీఎఫ్ చాటుకుందన్నారు. పకృతి వైపరిత్యాలతో కలిగిన నష్టాలను అధిగమించడానికి ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సంపన్న వర్గాలు కూడా వరద బాధితులను ఉదారంగా ఆదుకోవాలని టి పి టి ఎఫ్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేస్తుందన్నారు.