కరెంటు బిల్లు కట్టమంటే దాడి
- పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విద్యుత్ సిబ్బంది - ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేసిన కాంగ్రెస్ నాయకుడు - మనో వేదనలో ఏఈ నిజామాబాద్, బతుకమ్మ: కరెంట్ బిల్లు కట్టాలని అడిగినందుకు విద్యుత్ సిబ్బందిపై ఓ వినియోగదారుడు దాడి చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని మెండోరా మండల కాంగ్రెస్ నాయకుడు ఒకరు పరోక్షంగా బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశాడు. దీంతో విద్యుత్ సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బిల్లులు వసూలు చేయాలని కంపెనీ...