మద్నూర్ మండల మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సురేష్ అరెస్ట్
బతుకమ్మ, మద్నూర్: మద్నూర్ సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉండడంతో రాష్ట్రస్థాయి సర్పంచ్ల ఫోరం సంఘం పిలుపుమేరకు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. మద్నూర్ మండలం పరిధిలోని తాజా మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు దారస్వర్ సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో గంటపాటు ఉన్న సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు దారస్వర్ సురేష్ సొంత సూచికత్తుపై పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు దారస్వర్ సురేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడానికి తాజా మాజీ సర్పంచులు వెలుతారని ఉద్దేశంతోనే తనను పోలీసులు అరెస్టు చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం బేషరతుగా మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.