పన్ను చెల్లించి సహకరించాలి

బోధన్, బతుకమ్మ: ప్రజలు పన్ను చెల్లించి సహకరించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కోరారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, అధికారుల బృందాలు మంగళవారం పట్టణంలో పన్ను వసూలు చేశారు. రాకసీపేట్ లో పన్ను వసూళ్ల ప్రక్రియను సబ్ కలెక్టర్ పర్యవేక్షించారు. ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.