Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 7:08 pm Posted by : ramakrishna

యువ క్రీడాకారులకు ఆదర్శం పవన్ ప్రస్థానం

మోర్తాడ్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా యువజన, క్రీడా అధికారిగా బాధ్యతలు చేపట్టిన శెట్పల్లి గ్రామ వాస్తవ్యులు ఫిజికల్ డైరెక్టర్  బి .పవన్ కుమార్ ప్రస్థానం ఎందరో యువ క్రీడాకారులకు ఆదర్శమని ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్ అన్నారు. శెట్టిపల్లి గ్రామ వ్యాయమ ఉపాధ్యాయులు నరేందర్, నికిత, హరీష్, శుక్రవారం పవన్ ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు., అనంతరం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కార్యాలయంలో  మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. మారుమూల గ్రామం నుండి జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారిగా  ఎన్నిక కావడం సంతోష్ కరమైన విషయమని తెలియజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.