Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 11:34 am Posted by : ramakrishna

తితిదే ఎస్వీ అన్నదానం ట్రస్ట్ కు పవన్ సతీమతి విరాళం

తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేరుతో రూ.17 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. ఈరోజు మధ్యాహ్నం అన్నవితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని అన్నా లెజినోవా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.  కాగా, ఆదివారం అన్నాలెజినోవా శ్రీవారికి తలనీలాలు సమర్పించిన విషయం తెలిసిందే.


Pawan Satimati's donation to the SV Annadanam Trust on this day