Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 1:19 pm Posted by : ramakrishna

హైకోర్టును ఆశ్రయించిన..  పవన్ కల్యాణ్

వెబ్ న్యూస్, బతుకమ్మ : జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.  సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్ లో పవన్   పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తరపున  సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.  తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే సంస్థలపై చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన మెటా, గూగుల్ ఎక్స్‌లను  ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.  కేసు విచారణను డిసెంబర్ 22 వ తేదీకి  ధర్మాసనం వాయిదా వేసింది.