- పైరవికారులను పక్కన పెట్టి పేదలకే పట్టాలు ఇవ్వాలి
- సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ
సిరికొండ, బతుకమ్మ : సాగుదారులైన హుస్సేన్ నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని,పైరవికారులను కాదని పేదలకే పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం మండలం లోని హుస్సేన్ నగర్ గ్రామంలో జరిగిన రెవిన్యూ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలం లోని హుస్సేన్ నగర్ పరిదిలోని ప్రభుత్వ భూమి (ల్యాండ్ లార్డ్ జాగీర్దార్ సైదర్ జంగ్ ద్వారా సీలింగ్ ప్రభుత్వ భూమిగా )సర్వే నెం: 836లో ఎస్సీ, బీ. సీ, మైనారిటీలకు చెందిన 70 మంది వ్యవసాయ కూలీలు 2001 నుండి సుమారుగా 140ఎకరాలు సాగుచేసుకుంటున్నారని అన్నారు. సాగు చేస్తూ కబ్జాలో ఉన్నపేదలకు భూమి పట్టాలు ఇవ్వకుండ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ,బీ. సీ, మైనారిటీ పేదలు . ప్రభుత్వ భూమి సర్వే నెం: 836లో 285 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా,ఇందులో నుండి సుమారుగా 140ఎకరాలను గత 24సంవత్సరాల నుండి అడవి ఆముదం,సొయా,పజ్జోన్న తదితర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నరన్నారు. అందులో ఎస్సీ మాదిగలు 32 మంది, మాల కులానికి చెందిన 03 (ముగ్గురు), బీ. సీ కులాలకు చెందిన గొల్ల, ముదిరాజ్ లు, మైనారిటీ లు 35 మంది మొత్తం 70 కుటుంబాలు సాగు చెసుకుంటున్నాయని తెలిపారు. ఇట్టి భూమి గతంలో గ్రామ జగిర్దార్ సైదార్ జంగ్ S/O యూసుఫ్ అలీ అనే జగిర్ధార్ కుటుంబం నుండి సుమారు వెయ్యి ఎకరాలు సీలింగ్ ద్వారా ప్రభుత్వం తీసుకొని పేదలకు ఇచ్చిందని, మిగతా సర్వే నెంబర్.836 లో సాగు చేస్తున్న పేదలకు పట్టాలు ఇంకా రాలేదన్నారు.2018 ధరణి వచ్చిన నుండి సైదర్జంగ్కు చెందిన వారసుల మని కొందరు పైరవిలు చేస్తూ పేదల భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు..కొంత మంది డబ్బులు పోగు చెసుకొని నకిలీ వ్యక్తిని పెట్టి ఈ భూమిని కొట్టేయ్యాలని, కొంతమంది లక్షల డబ్బులను వేదజల్లి హైదరాబాద్ లో పైరవీలు నడు పుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఇదే సిరికొండ మండలం లోని మా పొలిమేర లో గల రామడుగు గ్రామంలో ఇలాగే ఇదే జాగీర్ధార్ వారసులమని ఆ గ్రామానికి చెందిన భూములను కబ్జా చేసి పట్టాలు పొందాలని ప్రయత్నాలు చేయగా సీపీఐ(ఎం. ఎల్) ప్రజాపంథా పార్టీ ఉద్యమం, గ్రామస్తుల పోరాటం తో, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడంతో బినామీ వ్యక్తుల పై గల రిజిస్ట్రేషన్ ను రద్దు చెసి అదే గ్రామనికి చెందేలాగా చేసి అక్కడి వారికి న్యాయం చేశామన్నారు. దశబ్దాల కాలంగా పహాణి నకల్ లో ప్రభుత్వ భూమిగా రికార్డ్ చేశారని. ప్రభుత్వ భూమి పేదలకు దక్కే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మళ్ళీ ఇన్నేళ్లకు మా గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లో గల పైరవికారులు, దళారులు డబ్బులు పోగేసుకొని ఇట్టి భూములను లబ్ధిదారులకు అందకుండ కొట్టేయ్యాలని పైరవీలు చేస్తున్నారన్నారు. కాబట్టి అధికారులు మానవతా దృక్పధంతో అలోచించి గత 24 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్న హుస్సేన్ నగర్ గ్రామ ఎస్సీ, బీ సీ, మైనార్టీ నిరుపేదలకు పట్టాలు ఇవ్వాల అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం ఎల్ ) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్,మండల నాయకులు వి. భూమాగౌడ్, పీ. ఓ. డబ్ల్యూ డివిజన్ కార్యదర్శి రావుట్ల పుష్ప లత, సీపీఐ(ఎం ఎల్ ) మాస్ లైన్ నాయకులు బి. భూమేష్, గోపి, గంగమలు, శ్రీకాంత్,ఆర్.శ్రీకాంత్, నాగరాజు, ఎస్. లక్ష్మి బరుకుంట బుమేశ్వర్ సింగరం నాగరాజు, ఇసంపల్లి రామస్వామి,చింతకింది మహేష్,రాసాబోయిన మోహన్, బి.రమేష్, భూదేవ్వ, రామస్వామి,జావీద్, మహేష్,తదితరులు పాల్గొన్నారు.