Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2024, 4:08 pm Posted by : ramakrishna

నగరంలో ప్రారంభమైన పథ సంచలన్ 

నగరంలో  కధం తోక్కిన స్వయం సేవకులు

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

ఆర్ ఎస్ ఎస్ స్వర్ణోత్సవ వేళ ఇందూర్ లో పథ సంచలన్ జరిగింది. నగరంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఐటిసీ( ఐటిఐ వరకు ) పథ సంచలన్ ఇందూర్ లో ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో జరిగింది. ఖాకీ ప్యాంటు,  తెల్ల చోక్క, దండ ధరించిన స్వయం సేవకులు ఈ పథసంచలన్ దాదాపు రెండు వెల పై చిలుకు పాల్గోన్నారు.  నగరంలోని ఖిల్లా , శంకర్ భవన్ స్కూల్, రాజీవ్ గాంధి అడిటోరియం నుంచి  శివాజీ  నగర్ లో గల ప్రభుత్వ ఐటిసి వరకు జరిగే పథ సంచలన్ కార్యాక్రమం అదివారం మద్యహ్నం జరిగింది. రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంబించి శత వసంతాల సంధర్బంగా పథసంచలన్ ప్రాంతం మొత్తం కాషయవర్ణంతో పులకించిపోయింది. పథ సంచలన్ సంధర్బంగా స్వయం సేవకులకు ప్రజలను నిరాజనం పలికారు. వారి  ర్యాలి జరిగిన ప్రాంతంలో పుల వర్షం కురిపించారు.  భారత్ మాతకు జై నినాధాలతో ప్రాంతం మారు మ్రోగిపోయింది. సాయంత్రం ఐటిసీ వద్ధ సహ ప్రాంత ప్రచార ప్రభు కుమార్ స్వయం సేవలకులకు దిశ నిర్ధేశం చేయనున్నారు.