నిజామాబాద్, బతుకమ్మ : దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ ను జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపు కుంటున్నామన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ (2 కె రన్ ) కార్యక్రమానికి కలెక్టర్, సీపీ సాయి చైతన్య ముఖ్య అతిథులుగా హాజరై 2 కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జిల్లా పాత కలెక్టరెటు గ్రౌండ్ నుంచి ఎన్.టీ.ఆర్ చౌరస్తా, పోలీస్ పరేడు గ్రౌండ్ , రైల్వే కమాన్ అయ్యప్ప మందిరం, మీ సేవా కార్యాలయం ,పాలిటెక్నిక్, నీలకంఠేశ్వర్ దేవాలయం వరకు నిర్వహించారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అనంతరం సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని 2 కె రన్ కార్యక్రమం నిర్వహించమన్నారు. భారత ఐక్యతా స్పూర్తికి, ప్రజల్లో జాతీయ ఐక్యత సామరస్యం, దేశభక్తి భావం పట్ల అవగాహన కల్పించడమే 2కె రన్ లక్ష్యమని సీపీ పేర్కొన్నారు. 2కె రన్ విజేతలు ఎమ్.సాయికిరణ్, డి.నాగేంధర్, వి. రాకేష్, ఆర్. ధరణి, ఎమ్.గోదావరి, ఎస్. నిఖిత, తదితరులకు కలెక్టర్, సీపీ బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, అదనపు డీసీపీ ( ఎ.ఆర్ ) రామ్ చందర్ రావ్, నిజామాబాద్, ట్రాఫిక్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, రిజర్వు ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ (అడ్మిన్ ), తిరుపతి (వెల్ఫేర్) , సీ.ఐ లు, 1,2,3,4,5,6, నిజామాబాద్ రూరల్, మాక్లూర్, ఎస్.ఐ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది. ఎ.ఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
