క్రీడలతో మానసికోల్లాసం
. స్టేడియంల నిర్మాణంపై . బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, ఒత్తిడి దూరమవుతుందని, ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీఆధ్వర్యంలో డీఎస్ స్మారక క్రీడలుకొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్రీడలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రీడా కారులను ప్రోత్సహించడంతోపాటు స్టేడియం నిర్మాణానికి క`షి చేస్తోందన్నారు....