Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2024, 3:30 pm Posted by : ramakrishna

క్రీడలతో మానసికోల్లాసం

Passionate about sports

. స్టేడియంల నిర్మాణంపై  

. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, ఒత్తిడి దూరమవుతుందని, ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని  బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీఆధ్వర్యంలో డీఎస్ స్మారక క్రీడలుకొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్రీడలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రీడా కారులను ప్రోత్సహించడంతోపాటు స్టేడియం నిర్మాణానికి క`షి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరమ్మతులు పూర్తయ్యాయన్నారు. నూతన స్టేడియం నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆటలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్ రెడ్డి, భక్తవత్సలం, ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వేణురాజ్, నిర్వాహకులు సాయిలు, పీఈటీల సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Passionate about sports