క్రీడలతో మానసికోల్లాసం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్  కాసుల బాలరాజు  జ్యోతి ప్రజ్వలన, క్రీడా పతాకాన్ని  ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్...