రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు జ్యోతి ప్రజ్వలన, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్ బాబా, గ్రామ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్ స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాం, పత్తి రాము స్వామి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, షేక్ నిస్సార్, సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేష్, తహసీల్దార్ తారాబాయి, ఎంపిడివో సురేష్ బాబు, ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
