పది ఫలితాలలో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : పదవ తరగతి వార్షిక ఫలితాలలో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ పనితీరుపై ఎం.ఈ.ఓలు, కాంప్లెక్స్ హెచ్.ఎంలతో కలెక్టర్ మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, ఆయా బడులలో నెలకొని ఉన్న స్థితిగతులు, కొనసాగుతున్న బోధన తీరు, అవసరమైన సదుపాయాల కల్పన తదితర...