. . . అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందే జీవన్ రావు
వెబ్ డెస్క్, బతుకమ్మ
పూర్వం తప్పు చేసిన పిల్లలకు పెద్దలు, ఉపాధ్యాయులు తీపించే పస్కీలు (గుంజిళ్ళు) ఇప్పుడు అంతర్జాతీయంగా సూపర్ బ్రెయిన్ యోగాగ ప్రాచుర్యం చెందిందని అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందే జీవన్ రావు అన్నారు. శనివారం ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పట్టణంలో కన్యాకుమారి, కర్ణాటక ప్రాంత వివేకానంద కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శాస్త్ర సంగమం అనే అంతర్జాతీయ యోగా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీవన్ రావు ఏ యోగిక్ ప్రాక్టీస్ ఫర్ ఇంటలెకచ్ వల్ ఎక్షలెన్స్ అండ్ వెల్ బీయింగ్, తోపుకరణం అనే అంశం పై తన పరిశోధన పత్రాన్ని సదస్సులో సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద పిలుపు మేరకు పాఠశాలల్లో, దేవాలయాల్లో గుంజిళ్ళు తీసే విధానం వచ్చిందన్నారు. ఇలాంటి బృహత్తరమైన పస్కీలు మళ్ళీ అంతటా పునరుజ్జీవింపజేసే అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ గుంజిళ్ళు సూపర్ బ్రెయిన్ యోగ చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని తెలిపారు.