Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2024, 5:58 pm Posted by : ramakrishna

కొలువుదీరిన పార్వతీసుతుడు

బతుకమ్మ, మోర్తాడ్: పల్లెలు పట్టణాలు చిన్న పెద్ద తేడా లేకుండా వాడవాడలా పార్వతీ సుతుడు కొలువు దీరినాడు. శనివారం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని గణపయ్య ప్రతిమలను తరలిస్తూ పిల్లలు పీకల తో కేరింతలు కొడుతూ, పెద్దలు బ్యాండ్ మేళంతో, డప్పుల దరువుతో, డోలు సన్నాయితో రంగ రంగ వైభవంగా ఊరేగింపు యాత్రలు నిర్వహిస్తూ తీసుకువచ్చారు. అనంతరం తాము అందంగా అలంకరించిన వినాయక మండపాలలో మేల తాలాల మధ్య వేదమంత్రాల మధ్య ఏకదంతుని నిలువబెట్టి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభించారు.

Parvatisuta who was measured