వ్యవసాయంపై కక్ష.. రైతులకు మరణశిక్ష

అన్నదాతల ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలే కాంగ్రెస్ దగాకోరు పాలనతో తల్లడిల్లుతున్న తెలంగాణ రేవంత్ మోసం వల్లే రైతుల ఆత్మహత్య లు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయంపై కక్షగట్టి రైతులకు మరణశిక్ష విధిస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది దాటిన దగాకోరు పాలనతో ఇప్పటికే దాదాపు 402 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నదాతల ఆత్మ హత్యలన్నీ సర్కార్ చేసిన హత్యలేనని...