దత్తోనపాసకులు ఇప్ప కాయల హరిదాసు స్వామి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 15న వినాయక నగర్ షిరిడి సాయి నగర్ 4 శ్రీ సద్గురు దామము ధార్మిక సేవా సంస్థ శ్రీ అనఘాదేవి సహిత దత్తాత్రేయ స్వామి ఆలయం లో దత్త పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు దత్తోపసకులు ఇప్ప కాయల హరిదాస్ స్వామీజీ పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి బాధలు ఉన్నా దత్త జయంతి రోజున దత్తాత్రేయుని నిష్టతో భక్తితో పూజిస్తే సకల దోషాలు తొలిగిపోయి సంతోషంగా ఉంటారని ఆ దత్తాత్రేయుని కృప ప్రతి ఒక్కరి పై ఉంటుందని ఆయన అన్నారు. 15వ తేదీ దత్త పౌర్ణమి పురస్కరించుకొని తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు ఆలయ ఆవరణలో భక్తులకు హోమ కార్యక్రమాలతో పాటు, సామూహిక కుంకుమార్చన, ఉదయం స్వామివారికి అభిషేక అన్నదాన కార్యక్రమాలు, కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనదలుచుకునే వారు అన్నదాన కార్యక్రమంలో దాతలు ఎవరైనా విరాళాలు అందించడానికి ముందుకు వస్తే నేరుగా ఆలయానికి వచ్చి రసీదు పొందవచ్చు అని ఆయన సూచించారు.