గాంధీ విగ్రహానికి పార్ట్ టైం అధ్యాపకుల వినతి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ పార్ట్ టైం అధ్యాపకులు ఏడవ రోజు సమ్మెలో భాగంగా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారు మాట్లాడుతూ, గాంధీ దృష్టిలో విద్య అనేది సమానత్వం సాధించడానికి ఒక సాధనమని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గాంధీ అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలలో పనిచేసే అధ్యాపకుల విద్య దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ, అలాంటి విశ్వవిద్యాలయాలలో నేడు పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలకు ఉద్యోగ...