వంటావార్పుతో పార్ట్ టైం లెక్చరర్ల నిరసన

ఉద్యోగ భద్రత కల్పించాలి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి   కామారెడ్డి, బతుకమ్మ : ఉద్యోగ భద్రత కోరుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ పార్ట్‌ టైమ్ లెక్చరర్లు మంగళవారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. 9 వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా పార్ట్‌ టైమ్ లెక్చరర్లు అందరూ కలిసి వంట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలసత్వం వహించడం వల్లే తాము రోడ్డుపై వంట చేసుకొని...