విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల బాధ్యత కీలకం
. . . ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీహరి కోటగిరి, బతుకమ్మ : విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే కీలకమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీహరి అన్నారు. శ్రీ వేద పాఠశాల 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో విద్యార్థులు చదువులకు దూరం కావడం, చెడు అలవాట్లకు దగ్గర కావడం పరిపాటిగా మారిందని ఆయనన్నారు. విద్యార్థులకు చదువు క్రమశిక్షణ రెండు ఎంతో ముఖ్యమని అవి...