Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 8:12 pm Posted by : ramakrishna

విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల బాధ్యత కీలకం

 

. . . ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీహరి

 

కోటగిరి, బతుకమ్మ :

 

విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే కీలకమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీహరి అన్నారు. శ్రీ వేద పాఠశాల 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో విద్యార్థులు చదువులకు దూరం కావడం, చెడు అలవాట్లకు దగ్గర కావడం పరిపాటిగా మారిందని ఆయనన్నారు. విద్యార్థులకు చదువు క్రమశిక్షణ రెండు ఎంతో ముఖ్యమని అవి రెండు ఉన్నవారు మాత్రమే తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారని ఆయనన్నారు. నేటి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో మేధాసంపత్తి ఉంటుందని చెప్పుకొచ్చారు.

 

Parents' responsibility is key in shaping students

 

పట్టణాలలోని విద్యాసంస్థలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల విద్యాసంస్థలే మెరుగైన విద్యను, వ్యక్తిత్వంతో కూడిన విద్యను, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని గుర్తు చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సునీల్, బోధన్ విద్యా వికాస్ విద్యాసంస్థల చైర్మన్ యార్లగడ్డ శ్రీనివాస్, ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ సూర్య ప్రకాష్ రావు, శ్రీ వేద పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరస్పాండెంట్ తెల్ల అక్షర, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.