Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2025, 5:40 pm Posted by : ramakrishna

లిటిల్ చాంప్స్ ప్లే స్కూల్ లో పేరెంట్స్, టీచర్ సమావేశం

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని  గంగస్థాన్  ఫేస్- 2 లో గల లిటిల్ చాంప్స్ ప్లే స్కూల్లో గురువారం పేరెంట్ టీచర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది పిల్లల ప్రతిభాపాటవాలని సమీక్షించారు.. ప్లే స్కూల్లో ప్రీ నర్సరీ నుంచి యూకేజీ వరకు చదువుతున్న పిల్లల చదువు పై స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న శ్రద్ధను, విద్యా  ప్రణాళికలను వివరించారు. ఆటపాటలతో పాటు చిన్నపిల్లలకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు లిటిల్ చాంప్స్ టీచర్లను అభినందించారు. ఇదే విలువలు కల్గిన విద్యను అందించి భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలనీ తల్లిదండ్రుల విజ్ఞప్తిని లిటిల్ చాంప్స్ బృందం స్వాగతించింది. ఈ కార్యక్రమంలో టీచర్స్ మాధురి సముద్రాల ,  స్రవంతి ,  జాగృతి, శ్రీనాథ్ పాల్గొన్నారు.