రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతకుముందు వినాయక నగర్...