రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీ.ఆర్.ఓ గీత ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 8.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు....