పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ) ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, జిల్లా నాయకులు బి.మురళి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12, 750 గ్రామపంచాయతీలో 60 వేల మందికి పైగా పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని వారికి గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో కార్మికులు...