నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ) ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, జిల్లా నాయకులు బి.మురళి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12, 750 గ్రామపంచాయతీలో 60 వేల మందికి పైగా పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని వారికి గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ కార్మికులకు ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడుస్తున్న ఇంతవరకు కార్మికులకు జీతాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత పోరాటాల ఫలితంగా జనవరి నెల నుండి కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల 5వ తారీఖున జీతాలను వారి ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు హామీని అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ గా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల తరహా 30% పి ఆర్ సి అమలు చేయాలని జీవో నెంబర్ 51 సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారంగా 16,500 వేతనాన్ని ఇవ్వాలి జన శ్రీ బీమాను వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా నాయకులు సత్యమ్మ, నాయకులు అరవింద్, రాజేశ్వర్, పంచాయతీ కార్మికులు మహేష్, రాము, చింటూ, సురేష్, బాలు, నరేష్, గంగాధర్, భోజన్న, నరేష్, శ్రీకాంత్, రమేష్, లింగం, రాజేశ్వర్, భోజన్న, సాయిలు, దుర్గ తదితరులు పాల్గొన్నారు.