ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. హౌస్ కన్స్ట్రక్షన్‌కు సంబంధించి ఇంటి నెంబర్ ఇచ్చేందుకు బాధితుడి నుంచి రూ.20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు ఏసీబీని సంప్రదించగా, ఉచ్చుపన్నిన అధికారులు నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు.