Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 6:23 pm Posted by : ramakrishna

లంచం తీసుకుంటూ దొరికిన పంచాయతీ కార్యదర్శి  కారోబార్

 

సిద్దిపేట, బతుకమ్మ :

 

సిద్దిపేట జిల్లాలో జక్కాపూర్ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి బి. అరుణ, కాంట్రాక్ట్ కరోబార్ దాసరి సంతోష్ 15 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామంలో రెండు ఇళ్ల మ్యుటేషన్ ఫైల్ ప్రాసెస్ కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేసి రూ.15 వేలు  తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కారోబార్ సంతోష్ వద్ద లంచం సొమ్ము స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయండి అని అధికారులు కోరారు.