గ్రామాలలో పంచాయతీ కార్యదర్షులు అప్రమత్తంగా ఉండాలి

7 రోజుల పాటు భారీ వర్షాలు ఎంపీడీవో అనంతరావు ఇందల్వాయి,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రాగల ఏడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామ పంచాయితీ హెడ్ క్వార్టర్స్ నందు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.వర్షాలకు నివాస గృహములు కూలుటకు ఆస్కారమున్న గృహాలను గుర్తించి అట్టి కుటుంబాలను వేరే వేరే గృహములకు లేదా ప్రభుత్వ భవనములకు మార్చాలన్నారు. గ్రామములోని ఐరన్ పోల్స్ ,స్తంభాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయవలసినదిగా తెలిపారు....