గ్రామాల్లో పడకేసిన పంచాయతీ పాలన

 అస్తవ్యస్తంగా తయారైన మురికి కాలువలు  ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం  ప్రత్యేకాధికారుల పాలనలో పట్టించుకునే వారే కరువు రుద్రూర్, బతుకమ్మ : గ్రామాలల్లో గల గ్రామ పంచాయతీ కార్యాలయాలల్లో పడకేసిన పంచాయతీ పాలన కొనసాగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో పారిశుద్యం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని, డ్రైయినేజీల్లో రోజుల తరబడి పూడిక తీయకపోవడంతో చెత్త చెదారం పేరుకుపోయిందన్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు నిండిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని, దోమకాటుతో ప్రమాదకరమైన డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు....