ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   ప్రభుత్వ పనుల కొలతలు నమోదు చేసి, అధికారికంగా ముందుకు పంపేందుకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ రేంజ్ యూనిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చొప్పదండి మండల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పైడి సతీష్ (గతంలో గంగాధర మండల ఏఈగా పనిచేశారు) గురువారం సాయంత్రం లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు చేపట్టిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద సీసీ పనులకు సంబంధించిన...