Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 6:12 pm Posted by : ramakrishna

డీసీసీ అభ్యర్తిత్వం కోసం పంపరి శ్రీనివాస్, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి దరఖాస్తులు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి  టౌన్ లో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ  (డిసిసి) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో కసరత్తు చేపట్టారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణానికి వచ్చిన అబ్జర్వర్ రాజ్పాల్ కరోరా కు సమాన్య ప్యాలెస్ లో కలిసి జిల్లా అధ్యక్ష పదవి కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి (భీం)లు ఇద్దరు తమ దరఖాస్తు పత్రాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపతానికి అంకితభావంతో  పనిచేస్తామని, తమ దరఖాస్తులను పరిశీలించాలని  మాజీ తాజా కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, భీమ్ ఏఐ సీసి ఇంచార్జి రాజ్ పాల్ ను కోరారు.