Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 6:37 pm Posted by : ramakrishna

పల్లికొండ వాసికి నీట్ లో అల్ ఇండియా ర్యాంక్

 

. . . కోచింగ్ లేకుండానే 18972 ర్యాంక్ సాధించిన రితీష్

 

భీమ్ గల్, బతుకమ్మ

 

మండలంలోని పల్లికొండకు చెందిన మేకల రితీష్ ఇటీవలే నిర్వహించిన నేషనల్ ఎలజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (యు.జి) లో ఆల్ ఇండియా ర్యాంక్ ను సాధించాడు. ఇంటర్ పూర్తి కాగానే ఎలాంటి కోచింగ్ లేకుండా తన స్వయం ప్రతిభతో నీట్ లో 18972 ఆల్ ఇండియా ర్యాంక్ ను సాధించాడు. రితీష్ 1వ తరగతి నుండి 5వ తరగతి భీమ్ గల్ కృషి హై స్కూల్ లో, 6 వ తరగతి నుండి ఎస్ఎస్సి వరకు నవోదయ లో, ఇంటర్ హైదరాబాద్ శ్రీ చైతన్య లో చదివాడు.ఈ సందర్బంగా ర్యాంక్ సాధించిన రితీష్ ను కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, గ్రామస్థులు అభినందించారు.